పంజాబ్‌పై కొల్‌కతా..ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం

250
Kohli, AB script DD's tournament exit
- Advertisement -

ఐపీఎల్‌-11లో భాగంగా మరో ఆసక్తికర పోరు జరిగింది. ఈ పోరులో పంజాబ్‌పై కొల్‌ కతా….ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం సాధించింది. బ్యాట్స్‌మన్‌ రెచ్చిపోయిన వేళ… బౌలర్లు నిస్సహాయులైన సమయాన… ప్రేక్షకులు అసలైన టీ20 మజాను అనుభవించారు. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ శివమెత్తడం.. దానికి తగినట్లే పంజాబ్‌ పూనకమొచ్చినట్లు ఊగిపోవడంతో ఇండోర్‌ స్టేడియం ఫోర్లు, సిక్సర్లతో తడిసి ముద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో ఏకంగా 245 పరుగులు చేసింది.

ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ (75; 36 బంతుల్లో 9×4, 4×6), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (50; 23 బంతుల్లో 5×4, 3×6) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఛేదనలో పంజాబ్‌ దీటుగానే స్పందించింది. ఓపెనర్‌ రాహుల్‌ (66; 29 బంతుల్లో 2×4, 7×6), కెప్టెన్‌ అశ్విన్‌ (45; 22 బంతుల్లో 4×4, 3×6) విజయం కోసం గట్టిగానే పోరాడారు. అయినా ఫలితం లేకపోయింది. పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 214 పరుగులే చేయగలిగింది.

ఇక మరో మ్యాచ్‌లో ఢిల్లీపై కోహ్లీ సేన ఘనవిజయం సాధించింది. కోహ్లి, డివిలియర్స్‌ శివమెత్తడంతో బెంగళూరు గెలవగా ఢిల్లీ ప్లేఆఫ్స్‌ కథ ముగిసింది. 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి సరైన ఆరంభం లభించలేదు. ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ,డివిలియర్స్ తొలుత నెమ్మదిగా ఆడిన తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా కోహ్లీ తనదైన శైలీలో మణికట్టు షాట్‌లతో ఆకట్టుకోగా డివిలియర్స్‌ సిక్సర్లతో విరుచుకపడ్డాడు. ఏబీ డివిలియర్స్‌ (72 నాటౌట్‌; 37 బంతుల్లో 4×4, 6×6), విరాట్‌ కోహ్లి (70; 40 బంతుల్లో 7×4, 3×6) మెరవడంతో లక్ష్యాన్ని బెంగళూరు 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

అంతకముందు బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా వెనుదిరిగిన రిషబ్‌ పంత్‌ మరోమారు రాణించాడు. పంత్(61; 34 బంతుల్లో 5×4, 4×6), అభిషేక్‌ శర్మ 46 నాటౌట్‌; 19 బంతుల్లో 3×4, 4×6) చెలరేగారు. వీరికకి శ్రేయస్‌ అయ్యర్‌ (32; 35 బంతుల్లో 3×4) సహకరించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 181 పరుగులు చేసింది.

- Advertisement -