కార్యకర్తలను కాపాడుకుంటాం:కొడాలి నాని

14
- Advertisement -

కార్యకర్తలను కాపాడుకుంటమాని స్పష్టం చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. మీడియాతో మాట్లాడిన నాని… ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు , కార్యకర్తలను టార్గెట్ చేశారని ఆరోపించారు.టీడీపీ ,జనసేన పార్టీ వాళ్లు మా పై దాడులకు పాల్పడుతున్నారు…వైసీపీ నాయకులను , కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారన్నారు.

రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని…వైసీపీ వారి పై దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ నిలబబడుతున్నారన్నారు.గొడవలు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని…వైసీపీ పై జరుగుతున్న దాడుల పై హైకోర్టుకు వెళ్తాం..ప్రైవేట్ కేసులు వేస్తాం అన్నారు.

దాడులు చేసిన వారితో పాటు.. చూస్తూ ఉన్న పోలీసుల పై కేసులు వేస్తాం అన్నారు. రాబోయే రెండు రోజుల్లో కృష్ణాజిల్లాలో పర్యటిస్తాం…గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతాం అన్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తాం…శాంతిభద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Also Read:Gold Price:పసిడి లేటెస్ట్ ధరలివే

- Advertisement -