ముంబైకి కొడాలి నాని తరలింపు

15
- Advertisement -

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చగా ఆస్పత్రి వైద్యులు నానికి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను ముంబైకి తరలించారు.

ప్రత్యేక విమానంలో ముగ్గురు వైద్యుల పర్యవేక్ష బృందంతో కొడాలి నాని, ఆయన ఫ్యామిలీ ముంబైకు బయలుదేరి వెళ్లారు.నానిని ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో హైదరాబాద్ నుంచి ముంబైకు తరలించారు.

Also Read:ప్రధాని మోడీ..రంజాన్ విషెస్

తీవ్ర అనారోగ్యంతో ఈనెల 26న కొడాలి నాని హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేశారు. నానికి పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. గుండెకు సంబంధించి మూడు వాల్వ్స్ పూడుకుపోయినట్లు తెలుస్తోంది.

- Advertisement -