క్రిడా రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. అమెరికా బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కోబ్ బ్రయంట్ ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాలిఫోర్నియాలో కుప్పకూలింది. ఈప్రమాదంలో కోబ్ బ్రయంట్ , ఆయన కుమార్తె సహా 9 మంది మరణించారు. పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగడంతో ఎన్‌బీఎ లెజెండ్ కోబ్ బ్రయంట్ మరణించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కోబ్ బ్రయంట్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

పలువురు క్రీడాకారులు కోబ్ మృతిపట్ల సంతాపం తెలిపారు. కొబ్ బ్రయంట్ బాస్కెట్‌బాల్ క్రీడలో ఎంతో పేరు సంపాదించారు. కోబ్ 20 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో రికార్డులు సాధించారు. నేషల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచారు. 2012 ఒలింపిక్స్‌లో యూఎస్ టీమ్ తరపున ఆడిన కోబ్..రెండు స్వర్ణపతకాలు గెలుచుకున్నాడు. 2016లో NBA నుంచి ఆల్ టైమ్ స్కోరర్‌గా రిటైర్ అయ్యారు. 18 సార్లు ఆల్ టైమ్ స్టార్‌గా నిలిచారు. గతంలో ఫోర్బ్స్ ప్రకటించిన అత్యధిక ధనవంతుల క్రీడాకారుల జాబితాలో బ్రయంట్ చాలా సార్లు తన పేరును నిలుపుకున్నాడు.

