కాళోజీ వర్సిటీలో పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌..

198
kaloji university
- Advertisement -

ఈ ఏడాది (2020) మెడికల్, డెంటల్ ‌పీజీ సీట్ల ప్రవేశాలకు వరంగల్ కాళోజీ నారాయణరావు వైద్య ఆరోగ్య విశ్వ విద్యాలయం నేడు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌లో అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 25 తుది గడువు. నిర్ధేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలి.

గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అభ్యర్థులు రావాల్సి వుండేది కరోనా వైరస్ దృష్ట్యా ఈ ఏడాది రిజిస్ట్రేషన్ సమయంలోనే సంబందించిన అన్ని ధ్రుపత్రాలను వెబ్ సైట్‌లో అప్లోడ్ చేయాలిసి ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు మల్లి నోటిఫికేషన్ ఇవ్వబడదు అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు కాళోజీ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in ను సంప్రదించవచ్చు..

- Advertisement -