ఉగాది వేడుకల్లో క్లింకార!

4
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఉగాది వేడుకల్లో నానమ్మ సురేఖ, అమ్మ ఉపాసనతో కలిసి పూజల్లో పాల్గొంది రామ్ చరణ్‌ కూతరు క్లింకార.

అయితే ఎక్కడా క్లింకార మొహం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఫోటోలను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయగా వైరల్‌గా మారాయి. బేబి పింక్ డ్రెస్ ధ‌రించి ప‌ద్ధ‌తిగా పూజ‌లో కూర్చున్న క్లింకార ఫోటోల‌ని నెటిజ‌న్స్ తెగ వైర‌ల్ చేస్తున్నారు.

క్లింకార అంటే ప్రపంచం మొత్తానికి శక్తిని ప్రసాదించే అమ్మవారి సహస్రనామాల్లో ఒకటి. అమ్మవారి అసమాన శక్తికి ఈ పదం అద్దం పడుతుంది.

&nbsp

- Advertisement -