క్లిన్ కారా బర్త్ డే..చెర్రీ ఎమోషనల్

13
- Advertisement -

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్-ఉపాసనల కూతురు క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే నేడు. ఈ సందర్బంగా ఎమోషనల్ అయ్యారు చరణ్ – ఉపాసన. క్లిన్ కారా పుట్టి సంవత్సరం కావొస్తున్న ఫేస్ మాత్రం ఒక్కసారి కూడా చూపించలేదు.

దీంతో ఈ పుట్టినరోజు సందర్భంగానైనా ఫోటో చూపిస్తారా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక క్లిన్ కారా బర్త్ డే సందర్భంగా ఓ వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఉపాసన ప్రగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంతవరకు ఎలా ఫీల్ అయ్యారో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. తమని అందరూ పిల్లల గురించి అడిగేవాళ్ళని, పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత పాప పుట్టడం అందరికి హ్యాపీగా ఉందని, తనని ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు మర్చిపోలేనని, తను పుట్టినప్పుడు అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని చెప్తూ ఏడ్చేశారు చరణ్, ఉపాసన.

Also Read:Chandrababu:అమరావతికి చంద్రబాబు

- Advertisement -