ఐపీఎల్ 2025లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ బోణి కొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. 152 లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. క్వింటన్ డికాక్ 61 బంతుల్లో 6 సిక్స్‌లు,8 ఫోర్లతో 97 నాటౌట్ గా నిలిచి జట్టును గెలిపించాడు.
నాలుగో స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రఘువంశీ (22 నాటౌట్) నుంచి డికాక్‌కు చక్కటి సహకారం అందడం వల్ల కోల్‌కతా ఛేదన సాఫీగా సాగిపోయింది.అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ 28 బంతుల్లో 33 పరుగులు చేయగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (29), సంజు శాంసన్ (13),కెప్టెన్ రియాన్ పరాగ్ (25) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read:రాజేంద్రప్రసాద్ కామెంట్స్‌పై వార్నర్!