హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చిన రాజస్తాన్ రాయల్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ కళ్లెం వేసింది. వరుస విజయాల ఊపులో మ్యాచ్‌ను తిరుగులేని రీతిలో మొదలుపెట్టింది కానీ.. తర్వాత తుస్సుమనిపించింది రాయల్స్. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్‌దీప్ యాదవ్ (4/20), ఆండ్రి రసెల్ (2/13)ల ధాటికి ఆ జట్టు 19 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. బట్లర్ (39; 22 బంతుల్లో 5×4, 2×6) టాప్‌స్కోరర్.
అనంతరం ఓపెనర్ క్రిస్ లిన్ (45; 42 బంతుల్లో 5×4, 1×6), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (41 నాటౌట్; 31 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో లక్ష్యాన్ని నైట్‌రైడర్స్ రెండు ఓవర్లుండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో కోల్‌కతాకు మెరుపు ఆరంభాన్నిచ్చిన నరైన్ (21; 7 బంతుల్లో 2×4, 2×6)తో పాటు ఉతప్ప (4)ను స్వల్ప వ్యవధిలో ఔట్ చేసి రాయల్స్ పోటీలోకి వచ్చినప్పటికీ.. నితీశ్ రాణా (21), కార్తీక్‌లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన లిన్ జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. మధ్యలో పరుగులు కట్టడి చేయడం ద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు రాయల్స్ బౌలర్లు. ముఖ్యంగా స్టోక్స్ (3/15) కోల్‌కతాకు సవాలు విసిరాడు. కానీ కార్తీక్ పట్టువదల్లేదు. లిన్ ఔటయ్యాక రసెల్ (11 నాటౌట్)తో కలిసి పని పూర్తి చేశాడు.
రాజస్థాన్: త్రిపాఠి (సి) కార్తీక్ (బి) రస్సెల్ 27, బట్లర్ (సి) సార్లెస్ (బి) కుల్దీప్ 39, రహానె (బి) కుల్దీప్ 11, శాంసన్ (ఎల్బీ) నరైన్ 12, స్టోక్స్ (సి అండ్ బి) కుల్దీప్ 11, బిన్నీ (స్టంప్డ్) కార్తీక్ (బి) కుల్దీప్ 1, గౌతమ్ (సి) కార్తీక్ (బి) మావి 3, ఉనాద్కట్ (బి) ప్రసిధ్ 26, సోథి (సి) కార్తీక్ (బి) ప్రసిధ్ 1, ఆర్చర్ (సి) గిల్ (బి) రస్సెల్ 6, అనురీత్ సింగ్(నాటౌట్) 3 ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 19 ఓవర్లలో 142 ఆలౌట్. వికెట్ల పతనం: 1-63, 2-76, 3-85, 4-95, 5-96, 6-103, 7-107, 8-128, 9-135, 10-142. బౌలింగ్: శివం మావి 4-0-44-1, ప్రసిధ్ క్రిష్ణ 4-0-35-2, సునీల్ నరైన్ 4-0-29-1, రస్సెల్ 3-0-13-2, కుల్దీప్ యాదవ్ 4-0-20-4.
కోల్‌కతా: నరైన్ (సి) గౌతమ్ (బి) స్టోక్స్ 21, లిన్ (సి) అనురీత్ (బి) స్టోక్స్ 45, ఊతప్ప (సి) త్రిపాఠి (బి) స్టోక్స్ 4, రాణా (ఎల్బీ) సోధి 21, కార్తీక్ (నాటౌట్) 41, రస్సెల్ (నాటౌట్) 11, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 18 ఓవర్లలో 145/4. వికెట్ల పతనం: 1-21, 2-36, 3-69, 4-117. బౌలింగ్: కృష్ణప్ప గౌతమ్ 2-0-32-0, స్టోక్స్ 4-1-15-3, ఆర్చర్ 4-0-43-0, సోధి4-0-21-1, ఉనాద్కట్ 3-0-23-0, అనురీత్ 1-0-10-0.