టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్.సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ లేకపోవడంతో ఇరువురి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎల్పీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు కె కేశవరావు మాట్లాడుతూ..నన్ను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు.కేసీఆర్ ఆశయాలను ఫుల్ ఫిల్ చేస్తామని తెలిపారు. దేశంలో పరిస్థితి క్రిటికల్ గా ఉంది. సీఎం ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తామని కేకే అన్నారు.
రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి నన్ను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..తెలంగాణ..టీఆర్‌ఎస్..ప్రజలు గర్వపడేలా నా ప్రయత్నం ఉంటుంది.దేశంలో పరిస్థితులను బట్టి టీఆర్‌ఎస్ సిద్ధాంత పరంగా నా వాయిస్ అందిస్తాము.కేటీఆర్ కి నా ధన్యవాదాలు. నా జీవితంలో ఇది నాకు పెద్ద ఛాలెంజ్ అన్నారు.రాజ్యసభ అంటే రాష్ట్రాలపై నిఘా లాగా ఉంటుంది. టీఆరెస్ పార్టీ పేరు నిలబెట్టే లాగా నా పనితీరు ఉంటుంది అని సురేష్ రెడ్డి తెలిపారు.