కైట్ ఫెస్టివల్‌కు కేరాఫ్ అడ్రస్‌ హైదరాబాద్‌- కేటీఆర్‌

600
minister ktr
- Advertisement -

సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్స్‌ అండ్ స్వీట్స్ ఫెస్టివల్‌ను మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ ఇవాళ ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ వివిధ స్టాళ్లను పరిశీలించి.. అంతర్జాతీయ కైట్ ప్లేయర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ పొంగులేటి పలువురు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనేందుకు దాదాపు 25 రాష్ట్రాలు, 20 దేశాల నుంచి ‘కైట్ ప్లేయర్స్’ వచ్చారు. స్వీట్స్ ఫెస్టివల్ లో దాదాపు వెయ్యికి పైగా దుకాణాలను ఏర్పాటు చేశారు. వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన నోరూరించే స్వీట్స్ ఆయా దుకాణాల్లో ఉన్నాయి.

minister srinivas goud

 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వం భారత్ గొప్పతనం. హైదరాబాద్ మినీ ఇండియా ..హైదరాబాద్‌లో దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడ్డ వారున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గుజరాత్ గల్లీ, పార్శి గుట్ట లాంటి ప్రాంతాలు ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం వాళ్లైనా హైదరాబాద్‌ను ఇంటిలా భావిస్తారు. అహ్మదాబాద్ కంటే ఘనంగా కైట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం.ఎన్నో దేశాల నుండి ఔత్సహికులు ఇక్కడికి రావడం సంతోషకరంగా ఉందన్నారు. కుటుంబంతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా ఏర్పాట్లు చేసిన సాంస్కృతిక శాఖకు అభినందనలు.దేశంలోనే కైట్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ktr minister

తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి జరిగిందని ఎన్నో అపోహలు, ప్రచారాలు చేసారు. ఆనాడు సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతోంది.హైదరాబాద్ ఖ్యాతి దేశవిదేశాలకు తెలుస్తోందంటే సీఎం కేసీఆర్ కృషి కారణం. అన్ని ఒకే దగ్గర ఉండేలా ఫెస్టివల్ నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు చేశాం అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇక్కడికి కుటుంబంతో వచ్చి సరదాగా గడపొచ్చు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందడంలో మంత్రి కేటీఆర్ పాత్ర కీలకం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

- Advertisement -