సినీ ప్రయాణం..కిషోర్ ఎమోషనల్!

7
- Advertisement -

తన సినీ ప్రయాణం గురించి ఎమోషనల్ అయ్యారు దర్శకుడు కిషోర్ తిరుమల. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న దర్శకుడు కిషోర్ తిరుమల, తన సినీ ప్రయాణాన్ని ప్రభావితం చేసిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్ననాటి నుంచే సినిమాలపై తనకు ఉన్న ఆసక్తికి, దర్శకుడిగా మారాలనే ఆలోచనకు కొన్ని క్లాసిక్ చిత్రాలు ప్రధాన ప్రేరణగా నిలిచాయని ఆయన తెలిపారు.

టైటానిక్, నిన్నే పెళ్లాడుతా, 7జీ బృందావన్ కాలనీ వంటి సినిమాలు తనపై లోతైన ప్రభావం చూపాయని కిషోర్ తిరుమల అన్నారు. ఈ చిత్రాలు భావోద్వేగాల బలం, మానవ సంబంధాల లోతు, నిజాయితీగా కథ చెప్పే విధానం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తనకు నేర్పాయని ఆయన చెప్పారు.

ఈ సినిమాలే తనను దర్శకుడిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయని, కథలో ఎమోషన్ ఎంత ముఖ్యమో అవి తనకు అర్థమయ్యేలా చేశాయని వివరించారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భర్త మహేశ్యులకు విజ్ఞప్తి’లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఇది కిషోర్ తిరుమల–రవితేజ కలయికలో వస్తున్న ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.

ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Also Read:మద్యం సీసాలపై కూటమి తప్పుడు ప్రచారం!

- Advertisement -