జార్జ్, రాక్షసుడి మానవ రూపం.. అతని ఆలోచన కపటం, ఒళ్ళు విషం, అతనితో పొత్తే వినాశనం… శారీరకంగా అవిటివాడు కావచ్చు, కానీ మానసికంగా అత్యంత బలవంతుడు, అతని బుద్ధి తో ఢీ కొట్టి గెలవడం అసాధ్యం.. అతనితో బేరానికి దిగలేరు,భయపెట్టి బతకలేరు.. వేటకు దిగిన మృగం కంటే క్రూరుడు… జాలి,దయ,ప్రేమ,కరుణ అతని డిక్షనరీ లో నే లేవు…
తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి, ముఖ్యంగా కబాలి,చీకటి రాజ్యం వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో జీవించి మెప్పించిన కిషోర్..తిరిగి ఒక అత్యంత బలమైన ప్రతినాయకుడి జార్జ్ పాత్ర ని పోషించనున్నారు, జార్జ్ పాత్ర భారతీయ చలనచిత్ర లో అత్యంత గొప్ప ప్రతినాయకులైన మొగాంబో, గబ్బర్ సింగ్ ని తలపిస్తుంది.
డా.రాజశేఖర్, పూజా కుమార్, అరుణ్ అదిత్, కిషోర్, రవివర్మ, చరణ్ దీప్, నాజర్ , షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ః శ్రీకాంత్, సినిమాటోగ్రఫీః అంజి, మ్యూజిక్ః శ్రీచరణ్, బ్యానర్: జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్, నిర్మాతః కోటేశ్వరరాజు, దర్శకత్వంః ప్రవీణ్ సత్తారు.