కిష్కిందపురి..ఓటీటీ డేట్ ఫిక్స్!

8
- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ చిత్రం కిష్కిందపురి. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించగా రూ.23 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు నెల తరువాత అక్టోబర్ 17న ఓటీటీలోకి రానుంది.

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. థియేటర్‌లో సత్తా చాటిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచిచూడాలి.

Also Read:రివ్యూ: ఆరి

- Advertisement -