BJP:పాలనలో కాంగ్రెస్ విఫలం

21
- Advertisement -

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ముషిరాబాద్ నియోజకవర్గంలో జీప్ యాత్ర నిర్వహించిన కిషన్ రెడ్డి…అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని..కానీ వాటి అమలులో చిత్తశుద్ది లేదన్నారు.

పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు దాటినా హామీల అమలు ఊసేలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన వస్తుందని…ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాట మేరకు హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటో ప్రజలు ఓటు సమాధానం చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుంభకోణాలేనని విమర్శించారు.

Also Read:స్త్రీలకు ఉపయోగ పడే ‘మర్జరీ ఆసనం’!

- Advertisement -