ఆరి దర్శకుడికి కేంద్రమంత్రి ప్రశంసలు

7
- Advertisement -

పేపర్ బాయ్ ఆ తర్వాత ఆరి బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టారు దర్శకుడు జయశంకర్. పేపర్ బాయ్ రిలీజ్ అయిన ఏడేళ్ల తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఆరి అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా పాజిటివ్‌ టాక్‌తో మంచి వసూళ్లను రాబడుతోంది.

ఈ నేపథ్యంలో ఆరి సినిమా దర్శకుడిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు గుప్పించారు. జయశంకర్ ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కింది అని కొనియాడారు కిషన్ రెడ్డి.

తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చిత్రయూనిట్ సైతం ఆనందంలో ఉంది. ప్రధానంగా కథ, ఆకర్షణీయమైన కథనం మరియు ప్రేక్షకుల మనసును తాకే సందేశం దీనికి తోడు అనూప్ రూబెన్ అందించిన సంగీతం చక్కగా కుదిరాయి. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి నటుల పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాలోని మాటలు, పాటలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా దర్శకుడి ఏడేళ్ల ప్రయాణానికి ఆరిపై పెట్టుకున్న నమ్మకం ప్రేక్షకుల మనసును గెలుచుకోవడం విశేషం.

Also Read:అఖిలేశ్ ..ఫేస్‌బుక్ అకౌంట్ సస్పెండ్

- Advertisement -