ప్రతీ ఒక్కరు మస్కులు ధరించండి- కిషన్ రెడ్డి

180
- Advertisement -

వ్యాక్సిన్ ఒక కవచంలాగా పనిచేస్తుంది ప్రతిఒక్కరు తప్పని సరిగా మస్కులు ధరించండి, వ్యాక్సిన్ తీసుకోండి, జాగ్రత్తలు పాటించండి అని సూచించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ మొండా డివిజన్ మహబూబ్ కళాశాలలో కార్పొరేటర్ కొంతం దీపిక ఆధ్వర్యంలో రాంగోళి ముగ్గుల పోటీలు నిర్వహించారు.. పెద్దఎత్తున మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొని ముగ్గులు వేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రపర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరై ముగ్గులను తిలకించారు.. విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం పొంది 75సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత ప్రభుత్వం అజాధికా అమృత్ మహోత్సవాలకు పిలుపునిచ్చిందని తెలిపారు.. అందులో భాగంగా రాంగోలి ముగ్గుల పోటీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని మహిళలు ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలని కోరారు. దేశం యొక్క సంస్కృతి, జాతీయ భావం, దేశ భక్తి తెలియచేసే విధంగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలను కూడా ముగ్గులు వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని వెల్లడించారు.. తెలుగు ప్రజలంతా కూడా పోటీలలో భాగం కావాలని ఆయన కోరారు. కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి, రేపటి నుండి 60ఏళ్ళు పైబడిన వారికి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోన్న మూడవ డోస్ టికాలను తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

- Advertisement -