ఆల్ పార్టీ మీటింగ్‌కు రాలేము: కిషన్ రెడ్డి

3
- Advertisement -

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్‌కు రాలేనని తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ఎంపీల సమావేశానికి మీరు పంపిన ఆహ్వానపత్రం అందింది. మీ ఆహ్వానానికి ధన్యవాదములు… ప్రాధాన్యత కలిగిన ఇలాంటి సమావేశాల్లో కీలకమైన అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కనీస సమయం అవసరమనే విషయం మీకు తెలిసిందే.

బిజెపి ఎంపీలందరికీ నిన్నరాత్రి ఆలస్యంగా ఈ సమాచారం అందింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా మా ఎంపీలందరికీ వారి వారి నియోజకవర్గాల్లో ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. దీంతో పాటు ముందుగా నిర్ణయించిన అధికార, అనధికార కార్యక్రమాల కారణంగా ఈ సమావేశానికి మేం హాజరుకాలేకపోతున్నాం అన్నారు.

భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని భావిస్తే కాస్త ముందుగానే తెలియజేస్తారని ఆశిస్తున్నాం.ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇకముందూ చిత్తశుద్ధి, అంకితభావంతో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటాం అని తెలిపారు.

Also Read:18 లేదా 19న రాష్ట్ర బడ్జెట్‌…నోటిఫికేషన్‌ విడుదల

- Advertisement -