- Advertisement -
కరోనా కట్టడికి సామాజిక దూరమే మార్గమని స్పష్టం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. మే 3 తర్వాత కంటైన్‌మెంట్, రెడ్ జోన్ ప్రాంతాల్లో ఎలాంటి సడలింపులు ఉండవన్నారు.
గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని, గ్రీన్‌జోన్ ఏరియాలో పరిశ్రమలు, మిగతా అన్ని పనులు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడికి కేవలం సామాజిక దూరమే మాత్రమే విరుగుడన్నారు.
మే 3 తర్వాత కూడా బస్సులు, విమానాలు, రైల్వే సేవలు ప్రారంభించకూడదని…ఆర్థికవృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ కోసం మనదేశంలో కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు పరిశోధనలు మొదలుపెట్టాయని చెప్పారు.
- Advertisement -