మూసీ ప్రక్షాళన చేయండి..పేదల ఇండ్లు కూల్చకండి!

4
- Advertisement -

మూసీ ప్రక్షాళన చేయండి…పేదల ఇండ్లు కూల్చకండన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి…ఇదే మా విధానం అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్క రోజు నిద్రపోండి అని సీఎం సవాల్ చేశారు కదా..! సీఎం రేవంత్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం అన్నారు.

రేపు మూసీ నిద్ర చేయబోతున్నాం అన్నారు. మూడు నెలల పాటు నిద్ర చేసేందుకూ మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలతో వారి ఇళ్లలో ఉండి, అక్కడే భోజనం చేసి, అక్కడే నిద్ర చేస్తాం అని తెలిపారు.

Also Read:డయాబెటిస్‌..ఈ ఆహారం తప్పనిసరి!

- Advertisement -