దసరా సినిమాలో వెన్నెలగా కీర్తి సురేష్ ఫస్ట్ లుక్

219
- Advertisement -

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మాస్-ఆపీలింగ్ ప్రమోషనల్ మెటిరియాల్ తో భారీ అంచనాలని పెంచుతోంది. నాని ఫస్ట్‌లుక్‌ నుంచి ఇటీవలే విడుదలైన ఫస్ట్‌ సాంగ్‌ ధూమ్‌ధామ్‌ వరకు అద్భుతమైన రెస్పాన్స్‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. తాజాగా నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెను వెన్నెలగా పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కీర్తి సురేష్ అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా మెరిసింది. కొత్తపెళ్లి కూతురు ధరించే పసుపు చీరలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన కీర్తి సురేష్ దసరాలో ఆమె పాత్రపై అంచనాలని పెంచింది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదల కానుంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు

- Advertisement -