బెంగళూరుపై కింగ్స్ ఘనవిజయం..

230
Kings XI overcome AB's one-man show
- Advertisement -

ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా జ‌రిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు- కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. బెంగళూరు విధించిన 149 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కొల్పోయి లక్ష్యాన్ని చేధించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఓపెనర్లు ఆమ్లా, వోహ్రా జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. వోహ్రా 21 బంతుల్లో 34 పరుగులు చేయగా,అక్షర్ పటేల్‌ 9 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు.

Kings XI overcome AB's one-man show

మరోవైపు ఆమ్లా మాత్రం తనదైన ఆటతో జట్టు విజయతీరాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.దూకుడుగా ఆడిన ఆమ్లా 32 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు.హషీమ్‌ ఆమ్లా (58 నాటౌట్‌; 38 బంతుల్లో 4×4, 3×6), మాక్స్‌వెల్‌ (43 నాటౌట్‌; 22 బంతుల్లో 3×4, 4×6) సత్తా చాటారు. ముఖ్యంగా తనశైలి ఆఫ్‌సైడ్‌ సిక్స్‌లతో అలరించిన మాక్స్‌వెల్‌.. చాహల్‌ బౌలింగ్‌లో లాంగ్‌ఆఫ్‌ దిశగా మరో సిక్స్‌ బాది పంజాబ్‌కు విజయాన్ని అందించాడు.

అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరు తొలి ఓవర్లోనే వాట్సన్‌ (1) వికెట్‌ కోల్పోయింది. విష్ణు వినోద్‌ (7), కేదార్‌ జాదవ్‌ (1) కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఈ స్థితిలో క్రిస్‌ గేల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్‌, మన్‌దీప్‌సింగ్‌ (28; 34 బంతుల్లో 1×4, 1×6) తోడుగా నెమ్మదిగా స్కోరు పెంచాడు. డివిలియర్స్‌ తన శైలికి భిన్నంగా ఆడాడు. భారీ షాట్లకు పోలేదు. 15 ఓవర్లకు ఆర్‌సీబీ స్కోరు 71 పరుగులే. మన్‌దీప్‌సింగ్‌ కూడా వెనుదిరిగాడు. ఈ స్థితిలో స్టువర్ట్‌ బిన్నీ (18 నాటౌట్‌; 20 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి డివిలియర్స్‌ గేరు మార్చాడు. 16 ఓవర్లకు 80/4తో ఉన్న బెంగళూరు స్కోరును ఉరకలెత్తించాడు.

Shaky RCB propped up by de Villiers fifty

17వ ఓవర్లో స్టాయినిస్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో మొదలైంది అతని ప్రతాపం.. అదే ఓవర్లో మరో బంతిని స్టాండ్స్‌లోకి కొట్టి 34 బంతుల్లో అర్ధసెంచరీ చేసుకున్న ఈ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌.. ఆ తర్వాత మరింత చెలరేగాడు. సందీప్‌శర్మ వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు సహా ఫోర్‌ బాదిన ఏబీ.. 19 పరుగులు రాబట్టడంతో బెంగళూరు 134/4తో నిలిచి 150 పరుగులు సులభంగా దాటేలా కనిపించింది. ఐతే ఆఖరి ఓవర్లో మోహిత్‌శర్మ తెలివిగా బంతులేయడంతో తొలి నాలుగు బంతులకు రెండే పరుగులు వచ్చాయి. కానీ చివరి రెండు బంతుల్ని అద్భుత సిక్స్‌లుగా మలిచిన ఏబీ.. బెంగళూరు ఇన్నింగ్స్‌కు మంచి ముగింపునిచ్చాడు. ఆఫ్‌సైడ్‌ దూరంగా పడిన బంతిని అతను లాంగ్‌ఆఫ్‌ మీదుగా సిక్స్‌కు తరలించిన తీరు అత్యద్భుతం. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతి కూడా ఏబీ దెబ్బకు స్టేడియం అవతల పడింది. డివిలియర్స్‌ సాధించిన తొమ్మిది సిక్సర్లలో ఎనిమిది సిక్సర్లు చివరి మూడు ఓవర్లలోనే రావడం విశేషం. చివరి నాలుగు ఓవర్లలో బెంగళూరు 68 పరుగులు రాబట్టింది. తొలి 31 పరుగులు 28 బంతుల్లో సాధించిన ఏబీ.. ఆ తర్వాత 44 పరుగుల్ని కేవలం 18 బంతుల్లోనే సాధించాడు.

- Advertisement -