Kingdom:ఫస్ట్ డే వసూళ్లు ఎంతో తెలుసా!

5
- Advertisement -

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం‘కింగ్‌డమ్’. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టింది. తొలి రోజు దాదాపు రూ. 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ (సుమారు రూ. 15.75 కోట్ల షేర్) వసూలు చేసింది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి రోజున రూ. 18 కోట్లకు పైగా వసూలు చేసింది. విదేశాల్లోనూ ఈ సినిమా అద్భుతంగా రాణిస్తోంది. అమెరికాలో ఇప్పటికే $1.1 మిలియన్లకు పైగా (దాదాపు రూ. 8 కోట్లు) గ్రాస్‌ను సాధించింది.

Also Read:TTD:భక్తులకు టీటీడీ హెచ్చరిక

ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, అయ్యప్ప పి. శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

- Advertisement -