ఖ‌డ్గం భామ … మళ్లీ కావాలంటోంది..!

215
Kim Sharma Re Entry for Movies!
- Advertisement -

ఓడలు బండ్లు…బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు డిమాండ్లు పెట్టి మరీ వసూలు చేసిన ఓ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు ఒకే ఒక్క ఛాన్స్ అంటూ మళ్లీ ఇండస్ట్రీ గడపతొక్కడానికి రెడీ అవుతోంది. అవసరమైతై ఫ్రీగా నటించడానికి సిద్దమంటోంది. ఇంతకీ ఆ భామ ఎవరనేగా మీ సందేహం.

ఖడ్గం సినిమాలో మెరుపులా మెరిసి.. కొన్ని తెలుగు సినిమాలో ఐటమ్ గా కసెక్కించిన బ్యూటీ కిమ్ శర్మ. కొంతకాలం యువరాజ్‌తో ప్రేమయాణం కూడా నడిపిన ఈ బ్యూటీ కెరీర్‌ మంచి పీక్‌ మీద ఉన్నప్పుడు సినిమాల నుంచి దూరమై కెన్యాకి చెందిన వ్యాపారవేత్త ఆలీ పంజాబీని పెళ్లాడింది.

అప్పట్లో కిమ్ శర్మని ఆమె భర్తని చూసి అంతా అవాక్కయ్యారు. మల్లెపూవులా ఉండే కిమ్ నల్లగా, లావుగా ఉన్న ఓ కెన్యా దేశీయుడిని ఎలా పెళ్లి చేసుకుందని సందేహించారంతా. అతనికి ఉన్న వేల కోట్ల రూపాయలను చూసే కిమ్ పెళ్లి చేసుకుందని కూడా అన్నారు. వీరిద్దరికీ పిల్లలు కూడా లేరు. కాగా కిమ్ భర్త ఈ మధ్య మరో మహిళ మోజుల పడ్డాడట. కిమ్ ని పట్టించుకోవడం మానేశాడట. దీంతో వీరిద్దరి దూరం బాగా పెరిగిపోయిందట.

ఇక భర్త దగ్గర ఉండలేక ఇండియా వచ్చేసిందట కిమ్. ఒంటరిగా ముంబైలోనే ఉంటోంది. ఈ 37 ఏళ్ల ఆంటీ ఇప్పుడు కష్టాల సుడిగుండంలో ఉన్నట్లుగా చెబుతారు. అయితే ఈ వార్తలను కొట్టిపారేసిన కిమ్ … మళ్లీ ముఖానికి మేకప్ వేసుకొని తన సత్తా చాటాలని మాత్రం తెగ తొందరపడుతోందట. ఇందుకోసం బంపర్ ఆఫర్ ను ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే .. ఫ్రీగా చేసేందుకు సైతం తాను సిద్ధమని ఆమె చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క ఛాన్స్ తో తన సత్తాను చూపించి.. గతంలో మాదిరి బిజీ కావాలని భావిస్తోందట. సినిమా కానీ టీవీ కానీ ఏదైనా ఒక ఛాన్స్ కోసం అమ్మడు పడుతున్న తపన చూసినోళ్లు అవాక్కు అవుతున్నారు. మొత్తంగా నాడు వద్దనుకుని వెళ్లిన ఇండస్ట్రీనే మళ్లీ ఆ ముద్దుగుమ్మకు ముద్దైందన్నమాట.

- Advertisement -