అమెరికాలో కిమ్ జాంగ్ హల్ చల్…!

243
Kim Jong Un Walking in NYC
- Advertisement -

అమెరికా ఉత్తర కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఏ క్షణంలోనైనా యుద్దం జరుగవచ్చు అన్న భయాందోళనలో ఇరుదేశాల ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికాలో సందడి చేశారు. అదేంటీ..?కిమ్ అమెరికాలో ఉండటం ఏంటనుకుంటున్నారా..!.నిజం కాదండి బాబు. ప్రపంచంలో మనుషుల్ని పోలీన మనుషులు ఏడుగురుంటారంటారు.

 Kim Jong Un Walking in NYC
అలా కిమ్‌ని పోలిన వ్యక్తి న్యూయార్క్‌లో సందడి చేశాడు. సేమ్ కిమ్‌ లాగే దుస్తులు, హవభావాలు ప్రదర్శించడంతో అంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. కొంతమందైతే ఏం జరుగుతుందోనని  అయోమయానికి గురయ్యారు.  ఇంకొంతమంది తమ కెమెరాల్లో బంధించడానికి ఉత్సాహం చూపారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది . ఆరు నిమిషాల వ్యవధి ఉన్న వీడియో ఒకదానిని క్యూపార్క్‌ పోస్ట్‌ చేయగా నిమిషాల వ్యవధిలోనే దాదాపు 9 లక్షల మంది చూశారు.

- Advertisement -