- Advertisement -
నూతన సంవత్సరం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విషెస్ చెప్పారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్. ఈ మేరకు పుతిన్‌కు లేఖ రాసిన కిమ్..రష్యాతో తమ దేశ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తామని అన్నారు. అంతేకాదు 2025లో నియో నాజీయిజాన్ని ఓడించి రష్యా సైన్యం, ప్రజలు విజయాన్ని దక్కించుకోవాలని కిమ్ ఆకాంక్షించారు.
24 ఏళ్లలో తొలిసారిగా ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. శత్రుదేశం దాడి చేస్తే ఈ రెండూ ఒకదానికొకటి సహకరించుకునేలా రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో పర్యాటకం ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి ఉత్తర కొరియా యత్నించింది.
Also Read:ఇంప్రెసివ్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’..పొంగల్ సాంగ్
- Advertisement -