వరుస విజయాలతో జోష్ మీదున్న చెన్నై చిత్తుగా ఓడిపోయింది. పోలార్డ్ సునామీలో ధోని సేన ఖంగుతింది. చెన్నై విధించిన 219 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మనిపించాడు పోలార్డ్. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పొలార్డ్ (34 బంతుల్లో 87 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శన కనబర్చగా, కృనాల్ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.
వీర విధ్వంసం ప్రదర్శించిన కీరన్ పొలార్డ్ తన మెరుపు బ్యాటింగ్‌తో చివరి వరకు నిలిచి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ చేయగా… మొయిన్ అలీ (36 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఫాఫ్ డుప్లెసిస్ (28 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. డు ప్లెసిస్‌కు ఐపీఎల్‌లో ఇది వరుసగా నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం.