బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్. దేశంలోని వివిధ భాషల్లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. కన్నడ బిగ్ బాస్ షోకి సంబంధించి హోస్ట్‌గా చేస్తున్న కిచ్చా సుదీప్ గుడ్ బై చెప్పారు.
ఇకపై తాను ఈ షోకి హోస్ట్‌గా చేయనని వెల్లడించాడు. 2013లో ఈ షో స్టార్ట్ అవ్వగా ఇప్పటివరకు 11 సీజన్‌లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఈ 11 సీజన్‌లకు సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
గత 11 సీజన్ల నుంచి నేను ఇష్టంతో పాటు ఎంజాయ్ చేసిన కార్యక్రమం బిగ్‌బాస్. ఈ షోకి హోస్ట్‌గా చేసిన నాపై మీరు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు. త్వరలో జరుగనున్న ఫినాలేతో బిగ్ బాస్‌తో నా ప్రయాణం ముగుస్తుంది. వ్యాఖ్యతగా నా శక్తి మేరకు మీ అందరినీ ఎంటర్‌టైన్ చేశానని ఆశిస్తున్నాను. ఇది మరపురాని ప్రయాణం, నాకు సాధ్యమైనంతవరకూ ఉన్నతంగా దీనిని కొనసాగించా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కలర్స్ కన్నడ టీవీకి వారికి ధన్యవాదాలు. ప్రేమతో మీ కే అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read:పింక్ బుక్‌లో రాస్తున్నాం…పోలీసులు జాగ్రత్త!