- Advertisement -
కన్నడ నటుడు కిచ్చ సుదీప్ హీరోగా పహిల్వాన్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు ఎస్. కృష్ణ దర్శకత్వం వహచంగా… స్వప్న కృష్ణ పహిల్వాన్ నేతృత్వంలో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
తొలిసారిగా సుదీప్ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్ దుహాన్‌సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. అర్జున్ జన్యా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వారాహి బ్యానర్ నిర్మిస్తోంది. ఆమధ్య మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశారు. తాజాగా ఈచిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. సెప్టెంబర్ 12న చిత్రం విడుదల కానుంది. పహిల్వాన్ ట్రైలర్ మీకోసం..
- Advertisement -