కియారా పెళ్లి., ఉపాసన సారీ !

31
- Advertisement -

బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ జైసల్మేర్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహానికి సంబంధించిన ఫోటోలను కాసేపటి క్రితం కియారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “ఇప్పుడు నా శాశ్వత బుకింగ్ అయిపోయింది. మా ముందు ప్రయాణంలో మీ ఆశీర్వాదాలు, ప్రేమను కోరుతున్నాము” అని ఫోటోలను షేర్ చేస్తూ కియారా ఓ ఇంట్రెస్టింగ్ మెసేజ్ ను కూడా రాసుకొచ్చింది.

ఇక కియారా తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే అభిమానులు, సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు చెబుతూ తమ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఈ జంటకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా శుభాకాంక్షలు తెలుపుతూ.. “కంగ్రాట్స్ కియారా. మీ జోడీ చూడముచ్చటగా ఉంది. పెళ్లికి మేము రాలేక పోయినందుకు సారీ” అని కామెంట్ చేశారు. మొత్తానికి హీరోయిన్ కు ఉపాసన సారీ చెప్పడం ఆకట్టుకుంది.

కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా వివాహానికి సంబంధించి వికీపీడియా వారికీ ముందుగానే పెళ్లి చేసేసింది. కియారా – సిద్దార్థ్ పెళ్లితో ఒక్కటి కాకముందే.. ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా ప్లాట్‌ఫామ్ వికీపీడియా సిద్ధార్థ్, కియారాలను భార్యాభర్తలుగా ప్రకటించింది. వారి ఇద్దరి వికీపీడియా పేజీలు పెళ్ళికి ముందే భార్యాభర్తలుగా అప్‌డేట్ చేయబడ్డాయి. దాంతో నెటిజన్లు వికీపీడియా పై ట్రోల్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి సిద్దార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ పెళ్లి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి…

బాలయ్య కోసం కాజల్ కి 2 కోట్లు

రైటర్‌…మహిళల కోసం ఉచిత ప్రదర్శన

విజయశాంతి షాకింగ్ విషయాలు!

- Advertisement -