కాంగ్రెస్ నేత,సినీ నటి ఖుష్బూ కోపమొచ్చింది. బెంగళూరులో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నేత రిజ్వాన్ అర్షద్‌కు మద్దతుగా బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖుష్బూ . ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఖుష్బూతో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆగ్రహానికి గురైన ఖుష్బూ, సదరు వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆకతాయి విషయంలో ఖుష్బూ స్పందన పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల ఇలాగే స్పందించాలని, వారికి గుణపాఠం చెప్పాలన్నారు. దీన్ని కన్నడలో కపాలమోక్షమంటారని.. ఇలాంటి వేధింపులకు గురయ్యే మహిళా రిపోర్టర్లు.. ఖష్బూ నుంచి నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఖుష్బూ దక్షిణాదిలో పార్టీ తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆదేశిస్తే తాను తమిళనాడులోని ఏ లోక్‌సభ నియోజకవర్గంలో నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. తిరుచ్చి లోక్‌సభ నియోజవర్గం నుండా ఖుష్బూ పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది.
This is called Kapala Moksha in Kannada. @khushsundar slapped a man who tried to misbehave with her while campaigning for Bengaluru Central Candidate. Even few lady reporters who are subjected to this kind of harassment should learn from Kushboo. #LokSabhaElections2019 pic.twitter.com/v5ZuFDTTZa
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) April 10, 2019