ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో టీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్ధాయికి చేరింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్,తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ కుంతియా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు కేటీఆర్.
కుంతియా స్కాంగ్రెస్ జోకర్ అంటూ ఎద్దేవా చేశారు. ఏఐసీసీ అలియాస్ ఢిల్లీ సుల్తాన్ ఇంఛార్జి అయిన ఈ జెంటిమేన్ ఏదో చెప్పారు..స్కాంగ్రెస్ జోకర్ మాత్రమే ఇలాంటివి చెప్పగలరని మండిపడ్డారు.ఆపిల్ సంస్థ గురించి కుంతియా ప్రస్తావించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఆ అజ్ఞానంలో ఆనందం ఉందని దుయ్యబట్టారు. 2016 ఆగస్టు నుంచి హైదరాబాద్‌లో ఆపిల్ కార్యకలాపాలు మొదలయ్యాయని ప్రస్తుతం 3,500 మందికి పైగా పనిచేస్తున్నారని చెప్పారు.
కేటీఆర్ పెట్టిన షరతులకు ఆపిల్, సామ్సంగ్ కంపెనీలు అంగీకరించలేదని అందుకే వారు వెనక్కి వెళ్లిపోయారని కుంతియా ఆరోపించారు. ఈ రెండు కంపెనీలు తరలిపోవడానికి కేటీఆర్ అవినీతే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేటీఆర్…కాంగ్రెస్ నేతలకు ఘాటైన సమాధానం ఇచ్చారు.
This Gentleman who’s the AICC (aka Delhi Sultanate) incharge says something that only a Scamgress joker can say; Ignorance is bliss
FYI to all, Apple started operations in Hyderabad in August, 2016 & currently employs 3,500 plus people which is their largest centre outside of US pic.twitter.com/w1AzjZDsMl
— KTR (@KTRTRS) September 8, 2018