ఓటీటీలో ‘ఖిలాడి’

237
rt
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. కోనేరు సత్య నారాయణ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకువచ్చింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటిటీ ప్రీమియర్‌లకు సిద్ధంగా ఉంది.

మార్చి 11వ తేదీ నుండి ఖిలాడీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ ఆటలో ఒక్కడే కింగ్… మరికొద్ది రోజులే వెయిటింగ్… ఫుల్ కిక్ తో మార్చ్ 11న డిస్నీ హాట్ స్టార్ లో మాస్ మహారాజ రవితేజ ఖిలాడీ రాబోతున్నాడు అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

టాలీవుడే కాదు బీ టౌన్‌లోనూ నిరాశపర్చింది ఖిలాడి. మరి ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా వేచిచూడాలి.

- Advertisement -