హర్యానా సీఎంగా ఖట్టర్…రేపు ప్రమాణస్వీకారం..!

378
manoharlal khattar

హర్యానాలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు లైన్ క్లియర్ అయింది. బీజేపీకి మద్దతిచ్చేందుకు జేజేపీ అంగీకరించడంతో కాంగ్రెస్ ఆశలు అడియాసలయ్యాయి. ఇక ఇవాళ సమావేశామైన బీజేపీ శాసనసభా పక్షం తమ నేతగా మనోహర్ లాల్ ఖట్టర్‌ని ఎందుకుంది. ఈ మేరకు గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ని కలిశారు బీజేపీ ఎమ్మెల్యేలు. రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో… జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ చౌతాలా సమావేశం అయిన తర్వాత రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దుష్యంత్ సింగ్‌‌కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ 40 స్ధానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 30,జన్ నాయక్ జనతా పార్టీ 10 స్ధానాలను గెలుచుకుంది. జేజేపీ మద్దతుతో సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారు.