Kharge:యోగి రాజీనామా చేశారా?

3
- Advertisement -

ఆర్‌సీబీ విజయోత్సవ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.ఈ మేరకు ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, హోంమంత్రి జి పరమేశ్వర రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో స్పందించారు ఖర్గే.

ఇది కేవలం ప్రమాదమేనని ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని చెప్పారు. కుంభమేళా సమయంలో జరిగిన తొక్కిసలాటకు ఎవరైనా రాజీనామా చేశారా..? అక్కడ లక్షలాది మంది పుణ్య స్నానాలు చేశారు. మృతదేహాలు తేలడం చూశాం అన్నారు.

అంతేకాదు, కొవిడ్‌ సమయంలో కూడా చాలా మంది మరణించారు. వీటికి బాధ్యత వహిస్తూ యోగి (యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశిస్తూ) రాజీనామా చేశారా..? అని ఖర్గే ప్రశ్నించారు.

Also Read:13న సాయికుమార్.. ‘నిజం’

- Advertisement -