కేటీఆర్ సహకారంతో స్వదేశానికి చేరుకున్నారు ఖానాపూర్ నియోజకవర్గం కు చెందిన పలువురు. మలేసియా జైలు లో ఉన్న కడెం మండలంలోని లింగాపూర్‌కు చెందిన నరేశ్, భాస్కర్, శంకర్, రాజేశ్వర్, శ్రీనివాస్,దస్తురాబాద్ మండలంలోని మున్యాలకు చెందిన రవీందర్‌లు తమ స్వస్థలాలకు చేరుకున్నారు.
నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్ చొరవతో మలేసియా దేశ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రప్పించారు కేటీఆర్. ఇటీవల మలేసియా కి వెళ్లి జైల్లో ఉన్న ఖానాపూర్ వాసులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు జాన్సన్.
కేటీఆర్ ను నంది నగర్ నివాసంలో కలిసిన మలేసియా జైలు లో ఉన్నారు కడెం మండలంలోని లింగాపూర్‌కు చెందిన నరేశ్, భాస్కర్, శంకర్, రాజేశ్వర్, శ్రీనివాస్,దస్తురాబాద్ మండలంలోని మున్యాలకు చెందిన రవీందర్‌ల కుటుంబ సభ్యులు. కేటీఆర్ ను చూసి భావోద్వేగానికి గురయ్యారు భాదితులు,వారి కుటుంబ సభ్యులు.
మీరు లేకుంటే మా జీవితం లేదు అంటూ కంటతడి పెట్టారు భాదితులు వారి కుటుంబ సభ్యులు. అన్ని విధాలా అండగా ఉన్న కేటీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని భాదితులు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read:Congress:సునీతారావు షోకాజ్ నోటీస్

