- Advertisement -
ఖమ్మం కార్పోరేషన్‌లో కొంతమంది ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి, టిక్ టాక్‌లో వీడియో చేసి డ్యాన్సులు, డైలాగ్ లతో కాలక్షేపం చేస్తున్న విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దీనిపై కమిషనర్ కొంతమందిని హెచ్చరించి మరికొందరికి నోటీసులు ఇచ్చారు. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. దీంతో ఈసారి వారికి విధించిన పనిష్‌మెంట్‌తో ఖంగుతిన్నారు.
టిక్‌టాక్ వీడియోల ఘటనలో బాధ్యులుగా చేస్తూ… మొత్తం 11మంది ఒప్పంద ఉద్యోగులను ఇప్పుడున్న విభాగాల నుంచి పారిశుధ్య విభాగానికి కేటాయిస్తూ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఏసీ గదుల్లో కూర్చొని పనులు మానేసి ఇలాంటి బాధ్యతారహిత చర్యలకు పాల్పడిన వారు… ఇక నుంచి చెత్త తీసే పనికి, కాలువలు శుభ్రంచేసే పనుల పర్యవేక్షణ విభాగానికి బదిలీ కావడంతో లబోదిబో మంటున్నారు.
- Advertisement -