గ్రామసభల్లో ప్రజాగ్రహం తేటతెల్లమవుతోంది. అర్హులైన వారికి పథకాలు అందలేదని ఆగ్రహంతో ఖమ్మంలో గ్రామ సభ టెంట్ కూలగొట్టారు గ్రామస్థులు. ఖమ్మం – కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్ గ్రామంలో ప్రజా పాలన సదస్సులో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదనిఆగ్రహంతో టెంట్‌ను పడవేశారు గ్రామస్థులు.
రుణమాఫీ అవ్వలేదు, పథకాలు రాలేదని కాంగ్రెస్ నాయకులను, అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. జనగామ జిల్లా – కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామ సభలో రుణమాఫీ అవ్వలేదు, పథకాలు రాలేదు అని.. ఇందిరమ్మ ఇండ్లు కూడా వారికి కావాల్సిన వాళ్లకే రాసారని కాంగ్రెస్ నాయకులను, అధికారులను నిలదీశారు గ్రామస్థులు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని పథకాలు ఇవ్వరా అని నిలదీశారు గ్రామస్తులు. అనంతారం గ్రామ సభలో పాల్గొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. పథకాలు రాలేదని, అర్హులకు పథకాలు ఇవ్వరా అని అనిల్ కుమార్ రెడ్డిని నిలదీశారు. రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో ఇల్లు రాలేదని అడిగితే కొడుతున్నారు..జనగామ నియోజకవర్గం వడ్లకొండలో గ్రామ సభలో ఇల్లు రాలేదని అడిగినందుకు దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.
అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభను అడ్డుకున్నారు ప్రజలు. అధికారులకు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం నెలకొంది.
Also Read:కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు వచ్చాయి: కవిత