మళ్లీ జోరు వర్షం..5 రోజులు స్కూళ్లకు సెలవు

1
- Advertisement -

తెలంగాణపై వరణుడి దండయాత్ర కొనసాగుతోంది. ఎడతెరపి లేని వర్షాలతో తెలంగాణ జలసంద్రంగా మారింది. బంగాళాఖాతంలో మరో వాయు గుండం ఏర్పడనుండటంతో మరిన్ని రోజులు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్. తిరిగి విద్యాసంస్థలు సోమవారం ప్రారంభం కానున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుత నీటిమట్టం 42.2 అడుగులకు చేరగా దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని …ఇబ్బందులు ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలన్నారు కలెక్టర్.

మహబూబాబాద్ జిల్లాలో భారీగా కురుస్తుండటంతో బయ్యారం పెద్ద చెరువు ఉదృతంగా ప్రవహిస్తోంది. గార్ల మండలంలో పొంగి పొర్లుతోంది పాకాల వాగు. పాకాల వాగు హైలెవల్ బ్రిడ్జి పైనుంచి మత్తడి ప్రవహిస్తుండగా రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

Also Read:మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళం

- Advertisement -