రివ్యూ : ఖాకి

303
khakee review
- Advertisement -

‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’, ‘నా పేరు శివ’, ‘ఊపిరి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో కార్తి.  తెలుగులో మంచి క్రేజ్, మార్కెట్ ఉన్న ఈ యంగ్ హీరో ఖాకితో ప్రేక్షకుల ముందుకువచ్చాడు.  తమిళంలో  ‘ధీరం అధిగారం ఒండ్రు’ పేరుతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ద్విభాష చిత్రంతో వచ్చిన కార్తికి ఈ సినిమా హిట్ ఇచ్చిందా..?ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం..

కథ:

ధీరజ్ హరి ప్రసాద్ (కార్తీ)1999 బ్యాచ్ లో ట్రైన్ అయిన డీఎస్పీ. ట్రైనింగ్ లో ఉండగానే ఇంటి ఎదురుగా అద్దెకు వచ్చిన వాళ్ల అమ్మాయి ప్రియ(రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. డీఎస్పీగా చార్జ్ తీసుకున్న దగ్గర నుంచి తన సిన్సియారిటీ కారణంగా ట్రాన్స్ ఫర్ అవుతూ ఉంటాడు. ఆ సమయంలో హైవేల పక్కనున్న ఇళ్లలోకి చొరబడి దోపిడీలకు పాల్పడి, దారుణంగా హత్యలు చేస్తుంటుంది ఓ ముఠా. వాళ్లను పట్టుకునే బాధ్యత ధీరజ్‌కు అప్పగిస్తారు ఉన్నతాధికారులు. రాజస్థాన్‌ కేంద్రంగా చేసుకుని పలు ప్రాంతాలు తిరుగుతూ.. దోపిడీలు చేస్తున్న ఆ ముఠాను పట్టుకునేందుకు ధీరజ్‌ అతని బృందం ఏం చేసింది? ప్రియ(రకుల్‌)ను ప్రేమించి పెళ్లిచేసుకున్న ధీరజ్‌.. తన కుటుంబ జీవితంలో ఏం కోల్పోయాడు? అన్నదే సినిమా కథ.

khakee review
ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,కార్తి, యాక్షన్ సన్నివేశాలు.  ధీరజ్‌ కుమార్‌ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. మేకప్‌ లేకుండా ప్రతి సన్నివేశంలోనూ సహజంగా కనిపించాడు. రకుల్‌ కొత్త తరహా పాత్రలో ఆకట్టకుంది.హీరోకు ప్రతీ ఆపరేషన్ లో సాయం చేసే పోలీస్ ఆఫీసర్ సత్య పాత్రలో బోస్ వెంకట్ ఆకట్టుకున్నాడు. మెయిన్ విలన్ గా అభిమన్యూ సింగ్ తన మార్క్ చూపించాడు. కిరాతకంగా హత్యలు చేసే రాజస్థాన్  దొంగల ముఠా నాయకుడి పాత్రలో ఒదిగిపోయాడు. మిగితావారు తమపాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ అక్కడక్కడా సాగదీతగా అనిపించే సన్నివేశాలు. పూర్తిగా క్రైం జానర్ లో సాగటం.. ఫ్యామిలీ ఆడియన్స్ కు యూత్ కు నచ్చే ఎమోషన్స్ లేకపోవటం కాస్త నిరాశ కలిగిస్తుంది. యాక్షన్ మోడ్ లో మొదలైన సినిమాలో వెంటనే రొమాంటిక్ సీన్స్ రావటంతో సినిమా స్లోగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. ఎక్కువగా 90వ దశకంలో సాగే కథ కాబట్టి, సన్నివేశాలకు ఆ కలర్‌ను తీసుకొచ్చిన విధానం సహజంగా ఉంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాకు అదే స్థాయి విజువల్స్ తో మరింత హైప్ తీసుకువచ్చాడు కెమెరామేన్ సత్యన్ సూర్యన్. గిబ్రన్ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది.  పాటలు సాదాసీదాగా అనిపిస్తాయి. డ్రీమ్ వారియర్ ఫిలింస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

khakee review
తీర్పు:

తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తీ. తన ప్రతీ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్న కార్తీ అదే బాటలో ఖాకీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథ,కార్తి నటన సినిమాకు ప్లస్ కాగా అక్కడక్కడ సాగదీసే సన్నివేశాలు మైనస్ పాయింట్స్. మొత్తంగా ఉత్కంఠ రేకెత్తించే ఓ కొత్త పోలీసు కథ  ఖాకి.

విడుదల తేదీ:17/11/2017
రేటింగ్: 2.75 /5
నటీనటులు:కార్తీ,రకుల్ ప్రీత్ సింగ్  
సంగీతం: జిబ్రాన్
నిర్మాత: ప్రభు,ప్రకాష్ బాబు
దర్శకత్వం: వినోద్

- Advertisement -