- Advertisement -
గంగమ్మ ఒడికి చేరారు ఖైరతాబాద్ మహాగణపతి. క్రేన్-4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కొనసాగుతోంది. బడా గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతంలో 25 ఫీట్ల వరకు పూడికతీత చేపట్టింది HMDA. విగ్రహం పూర్తిగా నిమజ్జనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.
భారీ గణపయ్య ఎలాంటి అవాంతరాలు లేకుండా గంగమ్మ ఒడికి చేరడంతో అధికారులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి.
భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో ఈ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. ఖైరతాబాద్ గణపతిని ట్యాంక్ బండ్ పై ఉన్న క్రేన్-4 ద్వారా నిమజ్జనం చేశారు. భారీ కొక్కేలకు తగిలించిన వినాయకుడిని నిదానంగా హుస్సేన్ సాగర్ నీటిలోకి దించారు.
Also Read:విజయ్ ఆంటోనీ…’భద్రకాళి’
- Advertisement -

