- Advertisement -
ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశ్ 69 అడుగుల ఎత్తులో ప్రజలకు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఖైరతాబాద్ బడా గణేశ్ చిన్న సైజులో ఎలా ఉంటాడో ఓ విద్యార్థి చేసిన అద్భుతం అందరిని ఆకట్టుకుంటోంది.
మాసబ్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో 3rd ఇయర్ చదువుతున్న విద్యార్థి సంపత్ వినూత్నంగా ప్రదర్శించారు. ఖైరతాబాద్ గణనాథుడి భారీ విగ్రహం తరహాన్ని కేవలం 5.5 సెం.మీటీర్ల పరిమాణంలో చాక్పోస్పై సూక్ష్మంగా చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 32 గంటలు శ్రమించినట్లు ఆయన తెలిపారు.
Also Read:చైనా విక్టరీ డే వేడుకలు..
- Advertisement -

