చిరు స్పీడ్‌ను అందుకోలేకపోతున్న…

242
Kajal shaking legs with chiru
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా హీరోయిన్ ఎవరనే విషయంలో చాలా చర్చోపచర్చలు జరిగాయి. మెగాస్టార్‌కు సెట్టయ్యే హీరోయిన్ దొరకడం కష్టమే అనుకున్నారంతా. కానీ వివి వినాయక్ హీరోయిన్ గా కాజల్ ను ఫైనల్ చేయడంతో అంతా షాకయ్యారు. రామ్ చరణ్ తో మగధీర సినిమాలో రొమాన్స్ చేసిన కాజల్…. చిరంజీవికి ఎలా సెట్టవుతుందంటూ పెదవి విరిచిన వారూ ఉన్నారు. అయితే అలా విమర్శించిన వారి అందరి నోళ్లూ మూయించారు వినాయక్. తొలిసారిగా చిరంజీవి, కాజల్ కలిసి దిగిన ఫోటో బయటకు వచ్చింది.

chiru-kajal0

ఈ ఫోటో చూసిన వారంతా జోడీ అదిరింది అంటున్నారు. ఇక ఖైది నెం 150 సినిమాకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ విడుదల చేస్తోంది. ప్రస్తుతం ‘ఖైదీ నెం 150′ సినిమా షూటింగ్ సెంట్రల్ యూరఫ్ లోని స్లోవేనియా, క్రోయేషియాలో జరుగుతోంది. మెగాస్టార్ 150వ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తి కాగా యూరప్‌లో పాటల షూటింగ్ వేగంగా జరుగుతోంది.

chiru-kajal1

రెండు పాటలకు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. చిరుతో స్టెప్పులేయడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఆయన స్పీడ్ కి తాను చేరుకోలేకపోతున్నట్టు కాజల్ తెలిపిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంకు దేవి శ్రీ సంగీతం అందిస్తోండగా, రామ్ చరణ్, లైకా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. చిరు పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని యూనిట్ భావిస్తోంది.

Khaidi No 150 (3)

డుబ్రోవిక్ మేయర్‌ ఆండ్రో ఈ సంధర్బంగా చిరంజీవిని కలుసుకున్నాడు. స్లోవేనియా, క్రోయేషియాలో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకోవడం పట్ల మేయర్ ఆనందం వ్యక్తం చేశారు. సినిమాలకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. భారతీయ సినిమాలంటేనే తనకిష్టమని ఈ సంధర్బంగా చిరుతో మేయర్ పేర్కోన్నారు. ఆయన చిరంజీవికి కానుకగా ఒక టోకెన్ సమర్పించి డుబ్రోవిక్‌ పర్యాటక రంగాన్ని బూస్ట్‌ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. చిరు టీమ్‌ను మేయర్ చాలా బాగా చూసుకున్నారని తెలిపారు.

Khaidi No 150 (1)

Khaidi No 150 (2)

- Advertisement -