కేజీఎఫ్‌2..కీ అప్‌డేట్!

107
kgf2
- Advertisement -

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కన్నడం,హిందీ, తెలుగు, త‌మిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సినిమాకు సంబంధించి కీ అప్‌డేట్ ఇచ్చేసింది. మార్చి 21న ఉదయం 11.07 గంటలకు సాంగ్ రిలీజ్ కానుండగా ఏప్రిల్ 13న యూఎస్ఏలో KGF Chapter 2 ప్రీమియర్లు ప్రదర్శితం కానున్నాయి అంటూ సినిమాకు సంబంధించి సూపర్ అప్‌డేట్ ఇచ్చేసింది చిత్రయూనిట్.

సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు తదితరులు నటించగా ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

- Advertisement -