కేజీఎఫ్ 2…7 రోజుల్లో 700 కోట్లు!

112
yash
- Advertisement -

‘కేజీఎఫ్ 2’ భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్‌గా రిలీజైన బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌కు, యశ్‌ యాక్టింగ్‌, యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్‌,బాలీవుడే కాదు విడుదలైన ప్రతీ చోటా కేజీఎఫ్ 2 రికార్డులు తిరగరాస్తోంది.కేజీఎఫ్ తర్వాత చాలామంది యశ్ కి అభిమానులుగా మారిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా 7 రోజుల్లో 700 కోట్లు రాబట్టగా తెలుగు రాష్ట్రాల్లో 61 కోట్ల షేర్‌ను సాధించింది. ఇక బాలీవుడ్‌లోనూ రూ. 300 కోట్లను రాబట్టింది. ఒక డబ్బింగ్ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు దక్కడం విశేషం.

కేజీఎఫ్‌ 2 దెబ్బకి బాలీవుడే కాదు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మరికొన్ని రోజులు కేజీఎఫ్‌2 సునామీ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది.

- Advertisement -