KGF 2…రెండు రోజుల్లో 240 కోట్ల వసూళ్లు!

86
kgf2
- Advertisement -

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఏప్రిల్ 14న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది.

తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు కూడా కేజీఎఫ్‌ 2 భారీ వసూళ్లను రాబట్టింది. రెండు రోజుల్లో 240 కోట్ల వసూళ్లను రాబట్టింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్‌లో మరిన్ని వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. యష్ నటన,ప్రశాంత్ నీల్ దర్శకత్వం సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాయి.

- Advertisement -