కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కన్నడం,హిందీ, తెలుగు, తమిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది.
తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10వేలకి పైగా స్ర్కీన్లలో విడుదలైంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. అలాగే ఇప్పటికే బుక్ మై షో, పేటీఎమ్ వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో 40 లక్షలకి పైగా టికెట్స్ అమ్ముడైనట్లుగా కూడా అధికారికంగా ప్రకటించారు.
యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రావు రమేష్, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటివారు కీలక పాత్రల్లో నటించారు.