కేజీ టమాటా.. ఎంతో తెలుసా!

158
tomato
- Advertisement -

టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. ఏకంగా కేజీ టమాటా ధర సెంచరీ కొట్టేసింది. మంచిర్యాల మార్కెట్ లో సోమవారం టమాటా కిలో రూ.100లకు విక్రయించారు. మార్చిలో కిలో టమాటా ధర రూ.20 నుంచి రూ.30 ఉండగా 20 కిలోల టమాటా బాక్సు ధర గత నెల రూ.800 నుంచి రూ.1000 పలికింది. అయితే మే వచ్చేసరికి అది ఏకంగా రూ.1600కు చేరింది.

ఎండల తీవ్రతకు రెండు, మూడు కిలోల వరకు పాడైపోతున్నాయని అందుకే కిలో టమాటా రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కూరగాయల ధరలు.. అందులోనూ టమాటా ధర భారీగా పెరగడంతో ప్రజలపై మరింత భారం పడుతోంది.

ధరలు బాగా పెరగడంతో ఏదీ కొనాలన్నా జనం హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సింలిండర్ ధరలు భారీగా పెరిగాయి. చికెన్, మటన్ రేట్లు కూడా భారీగా పెంచారు.

- Advertisement -