తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వలుపై స్పందించింది యుబీ సంస్థ. బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సంస్థ. ప్రస్తుతానికి బీర్లను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై బేవరేజ్ కార్పొరేషన్ సానుకూల స్పందించింది.త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటించింది యుబీ.
వినియోగదారులు కార్మికులు వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని తెలిపింది సంస్థ.
ధరల పెంపుపై యునైటెడ్ బ్రూవరీస్ సంస్థకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. 30 నుంచి 45 రోజుల్లో ధరలు పెంచుతామని కంపెనీ ప్రతినిధులకు వెల్లడించింది సర్కారు.
రాబోయే 12 – 13 నెలల్లో పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది. యూబీ బీర్లకు తెలంగాణాలో 70 నుంచి 80% మార్కెట్ 9ండగా 25% నుంచి 33% మేర ధరలు పెంచాలని డిమాండ్ చేస్తోంది యూబీ సంస్థ. బీర్ల ధరలు తక్కువలో తక్కువ 15% నుంచి 20% పెంచేందుకు ప్రభుత్వం సుముఖంవ్యక్తం చేసింది. కనీసం ₹10 నుంచి ₹20 పెరగనున్నాయి కింగ్ ఫిషర్ లాగర్ బీర్ల ధర.