మొక్కలు నాటిన కేతిరెడ్డి వాసుదేవరెడ్డి..

233
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ గా మూడోసారి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మలక్ పెట్ వికలాంగుల సంక్షేమ భవన్ కార్యాలయ ఆవరణలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి మొక్కలు నాటిన కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి.

ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉంది అని అన్నారు.పుట్టినరోజు అయిన ఎలాంటి శుభకార్యం అయిన మొక్కలు నాటడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతుందని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలి అని వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు…
ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ ల చైర్మన్లు,టీఆరెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు….

- Advertisement -